Sunday, April 28, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

సినిమా : “భగత్ సింగ్ నగర్”

సినిమా : “భగత్ సింగ్ నగర్”
రివ్యూ రేటింగ్ : 2.5/5
బ్యానర్ : గ్రేట్ ఇండియా మీడియా హౌస్
ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.
నటీనటులు :విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు
ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్ : మునిచంద్ర,
నృత్యం : ప్రేమ్-గోపి,
నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,
పి.ఆర్.వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

భగత్ సింగ్” అంటేనే మనందరిలో ఒక తెలియని వైబ్రేషన్ కలుగు తుంది.నేనొక మనిషిని మానవత్వానికి ఎలాంటి హాని కలిరగినా నేను స్పందిస్తాను అన్న భగత్ సింగ్ వ్యాఖ్యలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసిన సినిమానే “భగత్ సింగ్ నగర్”.గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్” .తెలుగు మరియు తమిళ బాషలలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న  “భగత్ సింగ్ నగర్” చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ గా థియేటర్స్‌లో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఒకరోజు ముందే పాత్రికేయులకోసం ప్రదర్శించడం జరిగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
చిత్ర దర్శకుడు మురళి(వాలాజా క్రాంతి)పెళ్లి తో ఈ సినిమా మొదలవుతుంది. భగత్ సింగ్ నగర్ ప్లమ్ బస్తీలో వుండే శీను(విదార్ధ్ ), లక్ష్మి (దృవీక), లు ఒకరి నొకరు ఇష్టపడు తుంటారు.పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలను కొంటారు. ఆ పక్కనుండే మరో బస్తీలోని అమ్మాయిలు రేప్ కు గురవుతూ కిడ్నాప్ అవుతుంటారు. అలా అమ్మయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ ను చూసిన లక్ష్మీ తాత చంద్రయ్య (ముని చంద్ర) శ్రీను, లక్ష్మీ ల పెళ్లి చేయాలని వారిని ఒప్పిస్తాడు. పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో శ్రీను,లక్ష్మీ లు సముద్రం ఒడ్డుకు వెళ్లగా అక్కడ లక్ష్మీ రేప్ కు గురై శ్రీను చేతిలో చనిపోతుంది.అది భరించలేని శ్రీను రేప్ చేసిన వారిని చంపే క్రమంలో శ్రీనును కూడా కాల్చి చంపుతారు.

కట్ చేస్తే సిటీ లో షాట్ ఫిలిమ్స్ తీసుకునే భగత్ (విదార్ధ్ ), అనన్య (దృవీక),టి.వీ లో శ్రీను,లక్ష్మీ లు చంపబడ్డ న్యూస్ చూస్తారు. భగత్ కు ఇది సంబంధం లేని న్యూస్ అయినా  శ్రీను కు జరిగిన సంఘటనను తనకు జరిగినట్లు ఫీలై శ్రీను,లక్ష్మి లు ఎలా చనిపోయారని తెలుసుకోవాలని భగత్ సింగ్ నగర్ కు వెళ్లి శ్రీను,లక్ష్మీ ల గురించి ఏంక్వైరీ చేస్తాడు. అక్కడ ఒక శ్రీను, లక్ష్మీ ల సమస్య ఒక్కటే కాదు  ఎంతో మంది అమ్మాయిలు కిడ్నాప్ కు గురవుతూ వారి మాట వినని వారిని హత్య చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న భరత్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇన్స్పెక్టర్ సంపత్ (బెనర్జీ) ని నిలదీసి భగత్ సింగ్ నగర్ లో జరిగిన శ్రీను, లక్ష్మీ ల ఇన్సిడెంట్ ను డాక్యుమెంట్రీ తీయడానికి వచ్చామని చెప్పి బయటకు వస్తే భగత్ పై అటాక్ జరుగుతుంది.దీని వెనుక పెద్ద మాఫియా కుట్ర దాగుందని అదేంటో తెలుసుకొని అక్కడ జరుగుతున్న కిడ్నాప్ లను అరికట్టాలని అనుకునే క్రమంలో ఎం.ఎల్.ఏ డాక్టర్ వై.సి.రావు (అజయ్ ఘోష్) హత్య చేయబడతాడు. ఈ హత్యా నేరం భరత్ పై మోపి భరత్ ఒక హంతకుడని పబ్లిసిటీ చేస్తారు. అయితే కిడ్నాప్ చేసిన అమ్మాయిలను మాఫియా గ్యాంగ్ ఎం చేస్తుంది ?.కిడ్నాప్ చేసే గ్యాంగ్ ను భరత్ పట్టుకున్నాడా? దీని వెనుక ఉన్న అసలు సూత్ర దారులెవ్వరు ? భగత్ సింగ్ నగర్ లో జరుగుతున్న ప్రాబ్లెమ్స్ ను భరత్ సాల్వ్ చేశాడా లేదా? అనేది తెలియాలంటే “భగత్ సింగ్ నగర్” సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
శీను(విదార్ధ్ ), లక్ష్మి (దృవీక), లుభగత్ సింగ్ నగర్ వంటి బస్తీలో వుండే మాస్ క్యారెక్టర్స్ లోను, సిటీ లో ఆధునిక యువతీ,యువకుల్లా చాలా న్యాచురల్ గా నటించారు. హీరోయిన్ తాత చంద్రయ్య (ముని చంద్ర), హీరో తల్లి శాంతమ్మ (ప్రభావతి),లు చాలా చక్కగా నటించారు.డాక్టర్ వై.సి.రావు (అజయ్ ఘోష్) స్క్రీన్ పై తక్కువ కనిపించినా తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు , ఇన్స్పెక్టర్ సంపత్ (బెనర్జీ) అధికారాన్ని దుర్వినియోగం చేసే పాత్రలో క్రూరంగా నటించాడు. భరత్ బావ రవి కాలే డాక్టర్ గా తనదైన శైలిలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పని తీరు :
మన ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగితే ప్రతి మనిషి రెస్పాన్ద్ అవ్వాలి. రెస్పాన్ద్ అవ్వకుండా మనకెందుకులే.. మన ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటే ఫ్యూచర్ లో మనపిల్లలు కూడా ఇలాగే అలవాటు పడతారు. అనేటటు వంటి కాన్సెప్ట్ ను తీసుకొని చేసిన దర్శకుడు వలజా క్రాంతి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని మంచి కాన్సెప్ట్ రాసుకొని ఇందులో లవ్ & రొమాంటిక్ థ్రిల్లర్ గా “భగత్ సింగ్ నగర్” చిత్రాన్ని దర్శకుడు  తెరకెక్కించాడు. డైరెక్టర్‌ కొత్తవాడైనా తన తొలి చిత్రంతోనే మంచి ఇంటెన్షన్ తో ఇప్పడు జరుగుతున్న అంశాలను జోడిస్తూ…అందరూ ఆలోచించే టటువంటి చక్కటి మెసేజ్ ఉన్న కథను ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావులేకుండా  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు వలజా క్రాంతి. ప్రభాకర్ దమ్ముగారి, సంగీతమే సినిమాకి బలం. ఆర్‌ఆర్‌ సైతం ఆకట్టు కుంటుంది. రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి కెమెరా వర్క్ పరవలేధు. . జియాన్ శ్రీకాంత్ ఎడిటింగ్  క్లాసీగా ఉన్నాయి.నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నాయి.  నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు ఈ సినిమాకు ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు.నిర్మాత రమేష్ ఉడుత్తు లండన్ లో ఉంటూ ఇండియాలో సోసియల్ యాక్టివిటీస్ చేస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ ఈ సినిమాను నిర్మించారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే  ఎంటర్‌టైనర్‌ “భగత్ సింగ్ నగర్”.

Latest Posts

spot_imgspot_img

Don't Miss