Sunday, April 28, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

DIS Movie Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2022

రేటింగ్ : 3.25/5

నటీనటులు: సందీప్ పగడాల, నవ్యరాజ్, వెంకీ,

టి ఎన్ ఆర్, నక్షత్ర, రవి వర్మ

దర్శకత్వం : రామచంద్ర రాగిపిండి

నిర్మాత: దేవ్ మహేశ్వరం

సంగీత దర్శకుడు: యస్ యస్ ఫ్యాక్టరీ

సినిమాటోగ్రఫీ: రామ్ పండుగల

ఎడిటర్ : చోటా కె ప్రసాద్

 

సందీప్ పగడాల హీరోగా రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో ‘ దొరకునా ఇటువంటి సేవ’ సినిమా రూపుదిద్దుకొంది. దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై దేవ్ మహేశ్వరం నిర్మించిన ఈ సినిమాలో నవ్య రాజ్ కథానాయికగా నటించారు. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

ఇది ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ నేపథ్యంలో జరిగే కథ..

అర్జున్ ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్.

ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ సెక్షన్ కి సంబంధించిన crime బాధ్యత అంతా అర్జున్ కి అప్ప చెప్పబడుతుంది.

అర్జున్ వృత్తిని దైవంలాగా భావిస్తుంటారు.

ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీగా ఉంటాడు. అక్రమ సంబంధాల అపోహలతో జీవితాలని నాశనం చేసుకుంటున్న వాళ్లకు కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. అదేంటంటే తన ఇంట్లోనే తన భార్య (నవ్య రాజ్), ప్రియుడు (వెంకీ) తో రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. ఆ సంఘటనను చూసిన అర్జున్ (అర్జున్ పగడాల) వాళ్ళిద్దరి పట్ల ఎలా ప్రవర్తించాడు. తన భార్య నవ్య, ప్రియుడు తో కలిసి తనని చంపడానికి ప్రయత్నిస్తే, వాళ్ల బారి నుండి తప్పించుకొని అర్జున్ బయటపడగలిగాడా లేదా అనేది ఈ చిత్ర కథాంశం.

 

ప్లస్ పాయింట్స్ :

సందీప్ పగడాల.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు 3 వేరియేషన్స్ లో చక్కగా నటించి సందీప్ మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషన్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో సందీప్ చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.

 

ఇక హీరోయిన్ గా నటించిన నవ్య రాజ్ తన హోమ్లీ లుక్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

 

దర్శకుడు రామచంద్ర రాగిపిండి తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.

ఈ కథను కన్ఫ్యూషన్ లేకుండా ఇలాంటి స్క్రీన్ప్లేతో చెప్పడం చాలా కష్టం.. అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా మేకింగ్ చేసిన దర్శకుడు రామచంద్ర రాగిపిండి ని అభినందించాలి. ప్లే ను మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లాగా కావాలని నడిపినట్లు ఉన్నాడు . అది కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాలా ఇంట్రెస్ట్ గా నడిపించారు. కొన్ని సీన్స్ మాత్రం చాలా థ్రిల్లింగా తెరకెక్కించారు. అలాగే సినిమా మొత్తం ఎక్కువ శాతం ఒకే లొకేషన్లో ఉన్నప్పటికీ పక్కా మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా అప్స్ అండ్ డౌన్స్ నరేషన్ లో ఉంటుంది.

స్క్రీన్ ప్లే లో రిపీట్ నెరేషన్ వలన కొన్ని సన్నివేశాలు కొంతమందికి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవచ్చు కానీ ఎక్కువ మందిని బాగా ఆకట్టుకోవడానికి ఆ రిపీట్ నేరేషన్ నే కారణం.

ఈ మధ్యనే వెంకట ప్రభు శింభుతో చేసిన “మానాడు” సినిమా కూడా ఇలాంటి స్క్రీన్ ప్లే వచ్చి విజయవంతం అయింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఆద్యంతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు రామచంద్ర రాగి పిండి పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతగా దేవ్ మహేశ్వరం పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా బాగున్నాయి.

తీర్పు :

‘ దొరకునా ఇటువంటి సేవ’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో సందీప్ పగడాల నటన, నవ్య రాజ్ నటన మరియు గ్లామర్ సినిమాలో హైలైట్ నిలిచాయి. సినిమా కూడా సస్పెన్స్ అండ్ ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ కి సంబంధించిన థీమ్ తీసుకుని, మంచి త్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్నారు. extramarital ఎఫైర్స్ వలన పర్యవసానాలను కూడా బాగా చెప్పారు. సందీప్ పగడాల ,నవ్య రాజ్, వెంకీ కొత్తవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ముగ్గురు పండించిన కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.

 

Rating : 3.25/5

Latest Posts

spot_imgspot_img

Don't Miss