Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

మిస్సింగ్ Review

రివ్యూ రేటింగ్ : 2.5/5
సినిమా : ”మిస్సింగ్”
బ్యానర్ : బజరంగబలి క్రియేషన్స్
నిర్మాతలు – భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా
కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం – శ్రీని జోస్యుల.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయి కె కిరణ్,
నటీనటులు : హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్, సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వులకి  తదితరులు
సాహిత్యం – వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల,
ఆర్ట్ – దార రమేష్ బాబు,
ఎడిటర్– సత్య జి,
సంగీతం – అజయ్ అరసాడ,
సినిమాటోగ్రఫీ – జనా.
పీఆర్వో – జీఎస్ కె మీడియా.

ఈమధ్య కాలంలో ఏ సినిమా చూసినా అందులో కథ లేక సన్నివేశం ఏదో ఒకటి గతంలో చూసిన సినిమాను గుర్తుకుతెస్తుంది. ఈ విషయంలో ఎవ్వర్నీ తప్పుపడ్డడానికేం లేదు. కథల కొరత అలా ఉంది మరి. ఇలాంటి టైమ్స్ లో మిస్సింగ్ అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు శ్రీని జ్యోస్యుల. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయికలుగా శ్రీని జోస్యుల దర్శకత్వంలో భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ “మిస్సింగ్”.ఈ సినిమా నవంబర్ 19 శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
నర్రా(హర్ష నర్రా) తన నలుగు మిత్రులందరూ కూడా వివిధ వృత్తుల్లో ట్యాలెంట్ పర్సన్స్.అయితే వీళ్లంతా… ఓ వ్యక్తి ట్రాప్ లో ఎంతోమంది అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ళు శ్రుతి (నికీషా)ను కిడ్నాప్ చేయాలను కుంటారు.ఇంతలో గౌతమ్ బైక్ శృతి(నికీషా) వాహనం కు డీకొని యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే శ్రుతి,గౌతమ్ ను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ వలన తన గతాన్ని మరచి పోయిన గౌతమ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న శ్రుతిని  ప్రేమించి పెళ్లిచేసుకొంటాడు. ఆ తర్వాత గౌతమ్,శృతిలు వెళ్తున్న కారు యాక్సిడెంట్ అయ్యి అందులో ఉన్న గౌతమ్ భార్య శృతి మిస్ అవుతుంది. అయితే గౌతమ్ కు డౌట్ అనుకున్న కొంతమంది అనుమానితులను పట్టుకొని మిస్సైన శృతి గురించి తెలుసుకుందామనే లోపు ఒక్కొక్కరు హత్యకు గురవుతారు.అయితే తనకు జరిగిన ఈ కారు యాక్సిడెంట్ వెనుక ఏదైనా కుట్ర ఉందా ?.. మరి హర్ష తన భార్య శ్రుతి ఆచూకీ ఎలా తెలుసుకున్నాడు? ఈ యాక్సిడెంట్ కేసుని జర్నలిస్ట్ మీనా సీరియస్ గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి ? అసలు ఆ నలుగురి హత్యకు ఎవరు ప్లాన్ చేశారు. ఈ స్టోరీలోకి ఏసీపీ త్యాగి, సీఐ లు తమ పాత్రలు ఎలా పోషించారు.. అసలు కార్ యాక్సిడెంట్ లో శృతి ఏమైంది? ఆమెను ఎందుకు, ఎవరు కిడ్నాప్ చేసారు. చివరకు ఆమె దొరికిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
హీరో హర్ష నర్రా పాత్రలో మరియు కీలక సన్నివేశాల్లో తన ఎమోషన్స్ కి తగ్గట్లుగా నటించారు.హీరో డైలాగ్ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ప్లస్ అయ్యింది.హర్ష రెండు వెరీయేషన్ పాత్రలను బాగా డీల్ చేసాడు. లవర్ బాయ్ పాత్రలోనూ… అటు రివెంజ్ తీర్చుకొనే పాత్రలో మెప్పించారు. అతనికి జంటగా నటించిన హీరోయిన్లు నికిషా, జర్నలిస్ట్ గా మిషా నారంగ్ తనదైన నటనతో మెప్పించారు.ఏసీపీ త్యాగి పాత్రలో హిందీ నటుడు రామ్ దత్ మెప్పించారు. ఛత్రపతి శేఖర్ కూడా తన పరిధి మేరకు నటించి తన పాత్రకు న్యాయం చేశాడు. డాక్టర్ పాత్రలో నటుడు సూర్య.. ఎప్పటిలాగే తనకు ఇచ్చిన డాక్టర్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.

 

సాంకేతిక నిపుణుల పనితీరు :
డైరెక్టర్ శ్రీని జోస్యులు రాసుకున్న కథ ఈ సినిమాకు బలం. ఇక చిన్న స్థాయి టెక్నికల్ టీమ్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. కథలో ట్విస్టులు బావున్నాయి  డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా  పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుని.. కథ.. కథనాలను నడిపించి విజయం సాధించాడు. మిస్సింగ్ సినిమాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి పది పదిహేను నిమిషాలకు ఓ ట్విస్ట్ తో… ప్రేక్షకులకు థ్రిల్ గురిచేస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పరవాలేదు.నిర్మాతలు ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో  నిర్మిచారు. ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మిస్సింగ్ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. థ్రిల్లర్ సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Latest Posts

spot_imgspot_img

Don't Miss