Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

పుష్పక విమానం రివ్యూ

సినిమా..పుష్పక విమానం
సమర్పణ : విజయ్ దేవరకొండ,
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని,
రచన-దర్శకత్వం: దామోదర.
నటీనటులు..ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వీ మేఘన, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, గిరిధర్, కిరీటి, బధ్రమ్, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్,
ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
ఎడిటర్ :రవితేజ గిరిజాల,
మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని,
కాస్టూమ్స్ : భరత్ గాంధీ,
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
సుందర్ (ఆనంద్ దేవరకొండ) ప్రభుత్వ పాఠశాలతో పని చేసే ఒక మామూలు ఉపాధ్యాయుడు. అతడికి మీనాక్షి (గీతా సైని) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. అయితే వారి మొదటి రాత్రే వీరి మధ్య అనుకోకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత తనకు నచ్చిన వాడితో మీనాక్షి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి సుందర్ తన భార్య లేచిపోయిన సంగతి కవర్ చేయడానికి నానా తంటాలు పడుతుంటాడు. అతడీ అవస్థల్లో ఉండగానే మీనాక్షి హత్యకు గురైన సంగతి వెల్లడవుతుంది. దీంతో పోలీసుల చూపు సుందర్ మీద పడుతుంది. ఇంతకీ మీనాక్షి ఇల్లు విడిచి వెళ్లిపోయాక ఏం జరిగింది?.. ఆమె మర్డర్ మిస్టరీ ఎలా వీడింది?.. సుందర్ ఈ కేసు బయటపడ్డాడా ?లేదా? అన్నది మిగతా కథ.

నటీనటుల పనితీరు
కాసేపట్లో తన పెళ్లనగా ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు మండపం నుంచి పారిపోవడం.. లేదా పెళ్లి తర్వాత భర్తకు,భార్యకు హ్యాండిచ్చి వెళ్లిపోవడం లాంటి దృశ్యాలు తెరమీద చాలా చూసి ఉంటాం.ఆనంద్ దేవరకొండను ముందుగా ఇలాంటి కథలో నటించడానికి ముందుకొచ్చినందుకు అభినందించాలి. భార్య లేచిపోయిన భర్త పాత్రలో నటించిన ఆనంద్ దేవరకొండ ధైర్యాన్ని మెచ్చుకోవాలి..సుందర్ పాత్రకు అతను ఉన్నంతలో బాగానే న్యాయం చేశాడు.హీరోయిన్లలో శాన్వి మేఘన ఆకట్టుకుంటుంది. సినిమాలో శాన్వి పాత్ర.. ఆమె కనిపించే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. మరో కథానాయిక గీతా సైని కూడా తన పాత్ర మేర మెప్పించింది. నరేష్ తన పాత్రలో బాగానే నటించి నవ్వించారు. ఎస్ఐ పాత్రలో సునీల్ బాగా చేశాడు.ఇంకా ఇందులో నటించిన నటీనటులు అందరూ తమ పరిధిమేర బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు దామోదర ‘పుష్పక విమానం’అనే కొత్త థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకొని దానికి వినోదంతో కొంచెం ఉత్కంఠ రేకెత్తించే కథ,కథనాలు రాసుకొని తీసిన విధానంలో అతణ్ని అభినందించవచ్చు.సినిమాను పూర్తిగా కామెడీ , థ్రిల్లర్ కోణంలో కథను నడిపిస్తూ దర్శకుడు చాలా చక్కగా డీల్ చేశాడు పెళ్లయిన కొన్ని రోజులకే భార్య లేచిపోతే భర్త పడే కష్టాల మీద సినిమా తీయాలనుకోవడం ఎగ్జైటింగ్ ఐడియానే. భార్య లేచిపోయిన విషయాన్ని కవర్ చేయడానికి హీరో పడే ఈ కష్టాల చుట్టూ నడిపించిన కొన్ని సన్నివేశాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా తన ఇంటికొచ్చిన కోలీగ్స్ ముందు.. షార్ట్ ఫిలిం హీరోయిన్ని తీసుకొచ్చి తన భార్య స్థానంలో పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి.సినిమాకు తగ్గ పాటలు బాగున్నాయి. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా శైలికి తగ్గ విజువల్స్ పడ్డాయి. .గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ప్రదీప్ ఎర్రబెల్లి లు సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో తీసిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.ఓవరాల్ గా చెప్పాలంటే మంచి కాన్సెప్ట్ తో తీసిన “పుష్పక విమానం” సినిమా చూసిన ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది.

Latest Posts

spot_imgspot_img

Don't Miss