Tuesday, April 30, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

సినిమా : “1997”
రివ్యూ రేటింగ్ : 2.5/5
బ్యానర్– ఈశ్వర పార్వతి మూవీస్,
నిర్మాత – మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్
నటీనటులు : డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు
ఎడిటింగ్ – నందమూరి హరి,
సంగీతం – కోటి,
కెమెరా – చిట్టి బాబు,
పి.ఆర్.ఓ : సురేష్ కొండేటి

వెనకబడిన కులాల విషయంలో ఇప్పటికీ అప్పటికీ పెద్దగా తేడాలేం లేవు.వెనకబడిన కులాల ప్రజలు ఆర్థికంగా ఎదిగితేనే వాళ్ల జీవితాల్లో మార్పులు వస్తాయనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం ద్వారా డాక్టర్ మోహన్ ప్రేక్షకులకు అందిస్తున్నాడు.ఈశ్వర పార్వతి మూవీస్ పతాకంపై డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం 1997. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం  ఈ నెల 26 న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఒకరోజు ముందే పాత్రికేయులకోసం ప్రీమియర్ షో ను ప్రదర్శించడం జరిగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
నిజాంపేట అనే ఊరిలో ఎమ్మెల్యే దొరస్వామి (రామరాజు) మాటే వేద వాక్యం.అక్కడి జనం తను ఏమి చెపితే అది వినాలి. తక్కువ కులం వారిని హీనంగా చూస్తూ ఆ కులం వారిని ఊరికి దూరంగా పెట్టి ఊరిలో ఇష్టారాజ్యం చెలాయిస్తుంటాడు.అక్కడున్న పోలీస్ వారు సైతం దుర్మార్గుడైన ఎమ్మెల్యే ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి గ్రామ ప్రజలకు సపోర్ట్ గా ఉండకుండా ఎమ్మెల్యే దొరస్వామి (రామరాజు)కు సపోర్ట్ చేస్తుంటారు.ఇంతలో నిజాయితీ పరుడైన ఐపీఎస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ (డాక్టర్ మోహన్) ఇదే ఊరికి ఏఎస్పీగా ట్రాన్స్ ఫర్ అయ్యి వచ్చే దారిలోనే గంగ, మంగ ఈ ఇద్దరు అమ్మాయిలు పరిచయ మవుతారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఏఎస్పీ విక్రమ్ రాథోడ్ ను తనవైపుకు తిప్పుకోవడానికి ఎమ్మెల్యే దొరస్వామి డబ్బు ఉన్న షూట్ కేస్ ను ఇవ్వబోతే విక్రమ్ రాథోడ్  తిరస్కరిస్తాడు. తన కొడుకు రాంబాబు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని, అందుకు సహకరించాలని విక్రమ్ ను కోరతాడు.అందుకు హెల్ప్ చేస్తాను అంటాడు.ఇంతలో ఊరి వెలుపల ఉన్న వెనుకబడిన కులాలకు చెందిన గంగ, మంగ అనే ఇద్దరు కిడ్నాప్ కు గురవుతారు. గంగ, మంగ  తల్లులు ఇద్దరూ పోలీస్ స్టేషన్ కు కంప్లేన్ట్ ఇవ్వడానికి వస్తే వారిపై దురుసుగా ప్రవర్తించి కేసుతీసుకోకుండా తిప్పి పంపుతాడు సీఐ చారి (శ్రీకాంత్ అయ్యంగార్). అదేంటని చారిని విక్రమ్ రాథోడ్ అడిగితే ఇవన్నీ ఇక్కడమాములె అని విక్రమ్ రాథోడ్ ను కన్విన్స్ చేస్తాడు.ఇంతలో మంగ ఊరి చెరువులో శవమై తేలుతుంది.తనతో మాట్లాడిన అమ్మాయి మంగ చనిపోయిందని తెలుసుకొని విక్రమ్ రాథోడ్ ఏంక్వైరీ మొదలుపెడితే ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపబడిందని తెలుసు కొంటాడు.అయితే మంగను ఎవరు రేప్ చేసి హత్య చేశారు? ఈ హత్యకు కారణం ఎవరు? ఆ హత్య గురించి ఎంక్వైరీ చేసే క్రమంలో విక్రమ్ రాథోడ్ ఎమ్మెల్యే ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో తను  తెలుసుకున్న వాస్తవాలు ఏమిటి? అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
విక్రమ్ రాథోడ్ గా( డాక్టర్ మోహన్) పోలీస్ పాత్రలో నేచురల్ గా చాలా చక్కగా నటించాడు. యువ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ కు కావాల్సిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. కథలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. సహజమైన పాత్రలో ఒదిగిపోయాడు. సీఐ చారి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ చాలా క్రూరుడుగా తన విల నిజాన్ని ఆ గ్రామ ప్రజలకు తన శాడిజాన్ని చూపించాడు .మరో ఐపీఎస్ అధికారి జగపతి పాత్రలో నవీన్ చంద్ర పర్వాలేదు అనిపించాడు. అతని  పాత్ర సినిమాకు కీలకం. రవిప్రకాష్, కోటి తో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
1997 సంవత్సరం నేపథ్యంగా సాగే కథ ఇది. తన తొలి చిత్రంతోనే చాలా చక్కటి ప్రతిభ చూపించారు దర్శకుడు డాక్టర్ మోహన్. 1997 సినిమాను మంచి సందేశాత్మక సినిమాగా, ఆద్యంతం ఆసక్తిగా చూసేలా తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోగా, నిర్మాతగా దర్శకుడిగా మారి సినిమాలో వన్ మ్యాన్ షో చూపించారు డాక్టర్ మోహన్. ఒకవైపు హీరోగా విక్రమ్ రాథోడ్ పాత్రలో సినిమాను భుజాన వేసుకుని నడిపిస్తూనే, మరోవైపు దర్శకుడిగా ఎక్కడా దృష్టి మరలకుండా కథను కథగా ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కించారు.1997 సంవత్సరపు రోజుల్లో  దొరల పాలన ఎలా ఉండేది, మరియు దొరల చేతుల్లో నలిగిపోయే అమ్మాయిలు , కులం అనే కట్టుబాట్లతో అప్పటి ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవో డాక్టర్ మోహన్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు.కోటి సంగీతం పరవలేధు, చిట్టిబాబు కెమెరా వర్క్ బాగుంది. . నందమూరి హరి ఎడిటింగ్ చాలా చక్కగా చేశాడు.మోహన్ గారు ఈ సినిమాను నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.ఓవరాల్ గా చెప్పాలంటే కుల మత బేధాలు లేకుండా అందరం ఒక్కటై ఉండాలనే రేగులర్ కాన్సెప్ట్ తో తీసిన “1997” సినిమా

Latest Posts

spot_imgspot_img

Don't Miss