Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

“చలో ప్రేమిద్దాం” రివ్యూ

రివ్యూ రేటింగ్ : 2.25/5
సినిమా : “చలో ప్రేమిద్దాం”
బ్యానర్ : హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్
నిర్మాతః ఉద‌య్ కిర‌ణ్‌,
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.
నటీనటులు :సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి , శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు
సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;
పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌,
ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌;
ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;
ఫైట్స్ః న‌భా-సుబ్బు,
కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌;
సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;
పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు,

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం. ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్ కి ప్రేక్షకులనుండి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ఫీల్ గుడ్ లవ్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఈ నెల 19న గ్రాండ్ గా థియేటర్స్‌లో విడుదల అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
వైజాగ్‌కి చెందిన ఆత్మారావు (సాయి రోనక్)ది మిడికల్ క్లాస్‌ ఫ్యామిలీ.చదువుల్లో చురుకైన కుర్రాడు. నాన్న(పోసాని) ఓల్డేజ్‌ హోమ్‌లో మేనేజర్‌. తల్లిదండ్రులను ఓల్డేజ్‌ హోమ్‌లో వదిలేసి వెళ్లిపోయిన కొడుకులపై ఉన్న కోపాన్ని తన కొడుకు ఆత్మారావు (సాయి రోనక్)పై చూపిస్తుంటాడు. తండ్రి పోరు తప్పించుకునేందుకు ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళతాడు. ఒక అమ్మాయిని వేధింపుల నుంచి కాపాడిన ఆత్మారావును ఇష్టపడుతుంది మధుమతి. ఇక హైదరాబాద్‌లో మధుమతి చేసే పనులకు ఇంప్రెస్‌ అయిన ఆత్మారావు ఆమె  ప్రేమలో పడతాడు. తన ప్రేమని వ్యక్తం చేసే టైమ్‌ వస్తుంది. ప్రేమని వ్యక్తం చేయగా మధుమతి సైలెంట్‌గా వెళ్లిపోతుంది.ఊరి పెద్ద, మామయ్య అయిన పెద్దప్ప (నాగినీడు), అన్న శివుడు (సూర్య) ఒప్పుకుంటేనే తన ప్రేమ సంగతి ఆత్మారావుకు చెబుదాం అనుకుంటుంది. సోదరి పెళ్లికి స్నేహితులతో పాటు ఆత్మారావును ఆహ్వానిస్తుంది మధుమతి.ఇలా కథ సాగుతుంటే అనూహ్యంగా మధుమతి కిడ్నాప్ కు గురవ్వడంతో పోలీసులు ఆత్మారావు ను అరెస్ట్ చేస్తారు,ఇంతకీ మధుమతిని ఎవరు కిడ్నాప్ చేశారు? మధుమతి ఎలా దొరికింది, అక్కడ తనని పెంచి పోషిస్తున్న పెద్దప్ప (నాగినీడు) మధుమతి ప్రేమని అంగీకరించాడా? చివరికి ఆత్మారావు, మధుమతి ప్రేమలో ఎలా ఒక్కటయ్యారా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు
ప్రెషర్ కుక్కర్ సినిమాతో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హీరో సాయి రోనక్‌ బాగానే చేశాడు. ఆత్మారావు క్యారెక్టర్ లో సరదాగా, ఛలాకీ కుర్రాడిగా ఆకట్టుకున్నారు. 90ఎంఎల్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ నేహా సోలంకి మధుమతిగా చాలా బాగా చేసింది.`ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్‌ పనిచేయదు` అని హీరోయిన్‌ చెప్పిన విధానం బాగా పేలింది. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్‌,పవన్‌, పోసాని, హేమ, నాగినీడు, ప్రభాకర్‌, సిజ్జు, శశాంక్‌ మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

 

సాంకేతిక నిపుణుల పనితీరు
ఇదొక కమర్షియల్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం.దర్శకుడు సురేష్‌ కొత్త డైరెక్టర్‌ అయినా తొలి చిత్రంతోనే ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావులేకుండా క్లీన్‌ సినిమా గా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లో మధుమతికి ఇంప్రెస్‌ అయ్యే సన్నివేశాలు, ఆ అమ్మాయి తన ఇరిటేషన్‌ని చిన్న స్లిప్‌లలో చెప్పే సన్నివేశాలు, దీనికి తోడు కాలేజ్‌లో పవన్‌, భరత్‌, అలాగే కారుమంచి రఘులతో వచ్చే సన్నివేశాలు,ఫస్టాఫ్‌లో మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు, సెకండాఫ్‌ లో పెళ్లి ఈవెంట్‌లో వచ్చి సన్నివేశాలు నవ్వులు పూయించే సన్నివేశాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఊరు పెద్ద నాగినీడు, ఎమ్మెల్యే ప్రభాకర్‌ ల మధ్య జరిగే ఊరిలో గొడవలు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, వీళ్ల మధ్య ప్రేమికుల ఇబ్బందులు..ఇవన్నీ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ మలిచాయి. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతమే సినిమాకి బలం. పాటలు బాగున్నాయి. సురేష్‌ గంగుల మెలోడీ సాంగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.అజిత్‌ వి రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి…ఇక హిమాలయ స్టూడియో మాన్షన్స్ మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాత ఉదయ్ కిరణ్ ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో  నిర్మిచారు .

Latest Posts

spot_imgspot_img

Don't Miss