Wednesday, May 1, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

అమోజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ “మిస్సింగ్” – రివ్యూ

నటీనటులు హర్ష నర్రా, నిక్కీషా రంగ్వాలా, మిషా నారంగ్, రామ్ దత్, ఛత్రపతి శేఖర్ తదితరులు

సాంకేతిక నిపుణులు ఎడిటర్ – సత్య జి, సంగీతం – అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ – జనా, సాహిత్యం – వశిష్ట శర్మ, స్టంట్స్ – సీనియర్ సతీష్, నిర్మాతలు – భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కిరణ్,
రచన, దర్శకత్వం: శ్రీని జోస్యుల

కథేంటంటే

భార్య శృతి (నిక్కీషా రంగ్వాలా) తో కలిసి షాపింగ్ మాల్ కు వెళ్తున్న గౌతమ్ (హర్ష నర్రా) కారుకు యాక్సిడెంట్ అవుతుంది. గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చేరుతాడు. అతనికి స్పృహ వచ్చాక భార్య శృతి మిస్ అయ్యిందని తెలుస్తుంది. శృతిని ఎవరు  కిడ్నాప్ చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు గౌతమ్. శృతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. కిడ్నాప్ కేసులు సాల్వ్ చేయడంలో పేరున్న ఏసీపీ త్యాగి (రామ్ దత్) కేసు టేకప్ చేస్తాడు. మరోవైపు రిపోర్టర్ మీనా (మిషా నారంగ్) తన సొంత ఇంట్రెస్ట్ తో కిడ్నాప్ కేసుపై పరిశోధన చేస్తుంటుంది.  శృతి కోసం గౌతమ్ వెతుకులాటలో వివేక్, రాజు, శ్రీధర్..ఇలా నలుగురు స్నేహితుల ముఠా మీద అనుమానం ఏర్పడుతుంది. అనూహ్యంగా ఆ ముఠాలోని సభ్యులు ఒక్కొక్కరుగా చంపడబడతారు. ఈ నలుగురే శృతిని కిడ్నాప్ చేశారా, అయితే ఆ నలుగురు ఏ డిమాండ్ ఎందుకు చేయలేదు. కిడ్నాప్ చేసిన యువకుల గ్యాంగ్ లో ఒక్కొక్కరిని ఎవరు చంపారు. శృతిని గౌతమ్ కాపాడుకున్నాడా, అసలు ఈ కిడ్నాప్ ముఠాతో గౌతమ్ కు ఏమైనా సంబంధం ఉందా, మీనాకు గౌతమ్ కు ఉన్న రిలేషన్ ఏంటి అనే ఆసక్తికర అంశాలు తెరపై చూడాలి.

నటీనటుల ప్రతిభ

రైట్ యాక్టర్స్ ఫర్ రైట్ క్యారెక్టర్స్ అనేది సినిమా బేసిక్ సూత్రం. దాన్ని మిస్సింగ్ సినిమా పూర్తిగా ఫాలో  అయ్యింది. సరైన నటుడిని లేదా నటిని ఎంచుకుంటే సగం విజయం సాధించినట్లేనని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. గౌతమ్ క్యారెక్టర్  హర్ష నర్రా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా ఈజీగా పర్మార్మ్ చేశాడు. తన భార్య శృతిని కోల్పోయిన సీన్స్ లో , తను మానసికంగా ఇబ్బంది పడుతున్న సన్నివేశాల్లో మెచ్యూర్డ్ యాక్టింగ్ కనబర్చాడు. శృతి క్యారెక్టర్ లో నిక్కీషా రంగ్వాలా బాగా నటించింది. ఆమెకు ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్ అనుకోవచ్చు. రిపోర్టర్ మీనా క్యారెక్టర్ లో మిషా నారంగ్ మెప్పిస్తుంది. కథలో తనదో కీలక పాత్ర. ఈ సినిమాను పూర్తిగా చూస్తే ఏ పాత్రకు ఏ పాత్రతో ఎలాంటి సంబంధం ఉందనేది తెలియదు. కథలో అన్ని కీలక ట్విస్టులు ఉంటాయి. అలాగని అవన్నీ అర్థం కాకుండా సాగవు, క్రిష్టల్ క్లియర్ గా ఉంటాయి. ఏపీసీ త్యాగి గా డిఫరెంట్ ఆటిట్యూడ్ తో నటించారు రామ్ దత్. ఇతర నటీనటుల కూడా కథలో ఒదిగిపోయారు.

సాంకేతిక  నిపుణుల పనితీరు

మిస్సింగ్ సినిమా ఆన్ స్క్రీన్ హర్ష హీరో అయితే ఆఫ్ స్క్రీన్ దర్శకుడు శ్రీని జోస్యుల హీరో అనుకోవచ్చు. కథ కథనం మాటలు దర్శకత్వ బాధ్యతలతో సినిమాను పూర్తిగా తన ఆలోచనలకు అనుగుణంగా మల్చుకున్నాడు. ఫస్టాఫ్ లోని ప్రతి సీన్ కు సెకండాఫ్ లో ని మరో సీన్ కు ముడిపెడుతూ, అందులో పాత్రలను ఇన్వాల్వ్ చేస్తూ శ్రీని చేసిన స్క్రీన్ ప్లే మాయ అద్భుతంగా ఉంది. టాలీవుడ్ కు శ్రీని ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడని అనుకోవచ్చు. బిగినింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ దాకా శ్రీని జోస్యుల అంతా తానొక్కడై చక్రం తిప్పాడు. నేపథ్య సంగీతం,  పాటలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడది ఈ థ్రిల్లర్ సక్సెస్ లో మరో కీ రోల్. మిగతా టెక్నీషియన్స్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్..ఇలా ప్రతి విభాగం దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా కథను తెరపై మరింత ఎలివేట్ చేసేలా పనిచేసింది. మిస్సింగ్ సినిమా నెక్ట్ సీన్ ను మనం ఊహించలేం. అంత గ్రిప్పింగ్ గా కొత్తగా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఇలా జరిగి ఉంటుందని అనుకునే లోపల ఆశ్చర్యపరిచే మరో సీన్ వస్తుంది. ఇలా ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమా చూపించారు.

రేటింగ్ 3/5

Latest Posts

spot_imgspot_img

Don't Miss