Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

RAJA VIKRAMARKA’ Movie Review

సమర్పణ : ఆదిరెడ్డి. టి ,
బ్యానర్ : గా శ్రీ చిత్ర మూవీ మేకర్స్
సినిమా : “రాజా విక్రమార్క”
రివ్యూ రేటింగ్ : 2.5/5
నిర్మాత: 88 రామారెడ్డి,
దర్శకత్వం: శ్రీ సరిపల్లి.
నటీనటులు :కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు
ఛాయాగ్రహణం: పి.సి.మౌళి,
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి,
ఎడిటింగ్: జస్విన్ ప్రభు,
ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్,
ఫైట్స్: సుబ్బు,నబా,
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కేకే,
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు,
సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా,
పీఆర్వో: పులగం చిన్నారాయణ

Rx 100, గుణ 369, చావు కబురు చల్లగ, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాల్లో  నటించి… అనతి కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నా కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:
తనికెళ్ళ భరణి ఒక సీనియర్ NIA అధికారి. అతనికి హోం మంత్రి(సాయి కుమార్) మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. అతన్ని గురు నారాయన్(పశుపతి). హోం మంత్రిని కాపాడుకోవడంలో భాగంగా… తనికెళ్ళ భరణి హీరో రాజా విక్రమార్క (కార్తికేయ)ను ఎన్.ఐ.ఏ. ఏజెంట్ గా నియమించుకొని… గురునారాయన్ ఆపరేషన్ ని తెలుసుకోవడానికి… సీక్రెట్ మిషన్ లో భాగంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ గా రాజా విక్రమార్కని హోం మంత్రి వుండే ప్లేస్ కి పంపిస్తాడు తనికెళ్ళ భరణి. అయితే హీరో రాజా విక్రమార్క హోంమంత్రి కూతురు కాంతి (తాన్య రవి చంద్రన్) ప్రేమలో పడతాడు. కాంతి కూడా రాజా విక్రమార్క తో ప్రేమలో పడుతుంది. అనుకోకుండా గురు నారాయణ్ హోం మంత్రిని చంపబోగా NIA ఏజెంట్ అయిన రాజా విక్రమార్క రక్షిస్తాడు. దాంతో గురు నారాయణ బ్యాచ్ హోం మంత్రి కాంతిని కిడ్నాప్ చేస్తారు. గురు నారాయణ్ కి, హోం మంత్రికి మధ్యన ఉన్న పగ ఏంటి? రాజా విక్రమార్క హోంమంత్రిని మరియు కిడ్నాప్ గురైన కాంతి ప్రాణాలను కాపాడతాడా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
మొదటి సారి ఎన్ఐఏ ఏజెంట్ గా నటిస్తున్న కార్తికేయ తన పాత్రకి అనుగుణంగా మంచి శరీర ఆకృతి తో డీసెంట్ గా నటించారు. పాత్ర కి తగ్గట్లుగా కార్తికేయ నటించిన విధానం చాలా బాగుంది. హీరోయిన్ తాన్య అందంగా కనిపించడం మాత్రమే కాకుండా, సినిమాలో ఆకట్టుకుంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన సుధాకర్ సినిమా సెకండ్ హాఫ్ లో కీ రోల్ పోషిస్తాడు. పాత్ర కి అనుగుణంగా మంచి నటనని కనబరిచాడు. హోంమంత్రి పాత్ర లో ఎప్పటిలాగానే సాయి కుమార్ చాలా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి తనదైన శైలి లో పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
థ్రిల్లర్ మూవీస్ ఎంచుకొని తీసిన కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తారు.ఆడియన్స్ ని కూడా కట్టిపడేస్తాయి. అందుకే దర్శకులు మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో కథలను సిద్ధం చేసుకుని విజయం సాధిస్తున్నారు. దర్శకుడు శ్రీ సరిపల్లి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు… కొంత ప్రేమను జోడించి ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మూవీని ఎక్కడా బోరింగ్ లేకుండా రాజా విక్రమార్క” చిత్రాన్ని తెరకెక్కించాడు.మంచి కిడ్నాపింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో… ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కింది. విడుదలకు ముందు టీజర్.. ట్రైలర్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చెసుకున్న ‘రాజా విక్రమార్క’ సినిమా విడుదల అయిన తరువాత కూడా మెప్పించింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ప్రేమ సీన్స్ తో సాగిపోయి… ఇంటర్వెల్ లో హీరోయిన్ కిడ్నాప్ తో ట్విస్ట్ ఇచ్చి… సెకెండ్ హాఫ్ ను మొత్తం యాక్షన్.. థ్రిల్లర్ గా మలిచి… సక్సెస్ అయ్యారు రచయిత, దర్శకుడు శ్రీ సరిపల్లి. కార్తికేయ మరియు తనికెళ్ళ భరణి కోసం రాసిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అంతేకాక తన మొదటి చిత్రం నే ఎన్ఐఏ బ్యాక్ డ్రాప్ తో విభిన్నమైన కథను ఎంచుకున్నందుకు తప్పకుండా మెచ్చుకోవాలి. పాత్రలకు అనుగుణంగా మంచి కథనం కూడా ఉండటంతో… సినిమా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా లో సినిమాటోగ్రఫి చాలా బావుంది. చేజింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు.జస్విన్ ప్రభు,ఎడిటింగ్  ఆకట్టుకుంది. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని చెప్పాలి. నిర్మాత 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో తీసిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.ఓవరాల్ గా చెప్పాలంటే రాజా విక్రమార్క చిత్రాన్ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా.

Latest Posts

spot_imgspot_img

Don't Miss