Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

Ram Asur’ Review

సినిమా : ”రామ్ అసుర్”
రివ్యూ రేటింగ్ : 2.25/5
రిలీజ్ డేట్: నవంబర్ 19, 2021
బ్యానర్ : ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్
నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ
నటీనటులు: అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌
పి.ఆర్.ఓ ; సాయి సతీష్,పర్వతనేని రాంబాబు

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయు క్తంగా కలసి నిర్మించిన హై ఓల్టేజ్ లవ్ & సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ `రామ్ అసుర్`.ఈ చిత్రంలోని ట్రైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రేక్షకులలో సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 19 న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన `రామ్ అసుర్` చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి.

 

కథ
రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే టైమ్ లో గర్ల్ ఫ్రెండ్ శెర్రీ అగర్వాల్ (ప్రియ) హ్యాండ్ ఇవ్వడంతో బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైనా జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో ఫ్రెండ్ సాయంతో పెద్దాయన రామాచారిని(శుభలేఖ సుధాకర్)ను కలుస్తారు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి రామాపురం అనే ఊరికి వెళ్లి సూరి గురించి ఏంక్వైరీ చేయగా సూరి (అభినవ్ సర్దార్)చనిపోయి 30 సంవత్సరాలు అయ్యింది అంటారు.కానీ సూరి స్నేహితుడు శివ (శానీ) ఉన్నాడని తెలుసుకొని శివను కలసి సూరి గురించి తెలుసుకుంటారు.అయితే సూరి (అభినవ్ సర్దార్) కూడా చాందిని (చాందిని తమిళ్ రాసన్) ను ప్రేమించిన తరువాత చాందిని సూరిని మోసం చేసిందని..సూరి కూడా  వజ్రాలు తయారు చేసే వాడని తెలుసుకుంటాడు.అయితే సూరి జీవితంలో జరిగిన సంఘటనలే తన జీవితంలో జరుగుతున్నాయని గుర్తిస్తాడు రామ్ (రామ్ కార్తీక్) .ఇంతకీ సూరికి, రామ్ కు ఉన్న సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి?  రామ్, పీనట్ డైమండ్ ను తయారుచేశాడా లేదా? రామ్ రాకతో సూరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
సూరి పాత్ర పోషించిన అభినవ్ సర్దార్ . ఓ షేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో ఎగ్రెసివ్ లుక్ లో సర్దార్ పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ బాగుంది. నటనలో మాత్రం ది బెస్ట్ ఇచ్చాడు.రామ్ కార్తీక్  రొమాంటిక్ బాయ్ గా వజ్రాలు తయారు చేసే సైన్టీస్ట్ గా చాలా చక్కగా నటిస్తూ చక్కగా కనిపించాడు. షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్, శివ పాత్రలో షానీ సాల్మన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
వజ్రం తయారీ అనే కొత్త కాన్సెప్ట్ ఇంతవరకూ ఎవ్వరూ అటెంప్ట్ చెయ్యలేదు. తీసుకుని కృత్రిమంగా డైమండ్ తయారుచేయడమనే కాన్సెప్టే కొత్త అనుకుంటే.. ఆ కాన్సెప్ట్ కు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టి ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చి “రామ్ అసుర్” కు ప్రాణం పోశాడు దర్శకుడు…కొత్త యాక్టర్స్ ను పెట్టుకొని లిమిటెడ్ బడ్జెట్లోనే ఫస్ట్ టైం ఇంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. తను చేసిన  ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇలాంటి కొత్త పాయింట్ ను తీసుకొని చేసిన దర్శకుడు, రైటర్ త్రిపర్ణ వెంకటేష్ సక్సెస్ అయ్యాడు. దర్శకుడికి ఇది మొదటి  సినిమా అయినా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్ని విభాగాలను దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ  చక్కగా హ్యాండిల్ చేశాడు. మొదటి సినిమాకే ఇన్ని బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ డైరక్టర్.. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఇంకా పెద్ద బడ్జెట్ అయి ఎస్టాబ్లిష్ అయిన స్టార్స్ ఉంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళేది.బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. సెకండాఫ్ నుంచి”రామ్ అసుర్” పరుగులుపెడుతూ ఆడియన్స్ కు ఫుల్ థ్రిల్ అందిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టదు.10 సినిమాలు చేసిన దర్శకుడు ఎలా చేస్తాడో అంత మెచ్యూరిటీ గా ఈ సినిమా చేశాడు. అలాగే ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,మేజర్ హైలెట్, సర్దార్ ఎపిసోడ్ గానీ సర్దార్ పర్ఫార్మెన్స్ ప్రజెంట్ గాని చాలా చక్కగా ఉంది. వీటన్నిటితో పాటు బీమ్స్ సిసిరిలియో అందించిన మ్యూజిక్ , బ్యాగ్రౌండ్ స్కోర్,ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో తీసిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.ఓవరాల్ గా చెప్పాలంటే “రామ్ అసుర్” సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త ఎంటర్టైన్మెంట్ నిస్తుంది.ఈ వీకెండ్ రిలీజైన సినిమాలు అన్నింటిలో ఇది కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది.పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. చూసిన వారందరికీ తప్పక నచ్చుతుంది.

Latest Posts

spot_imgspot_img

Don't Miss