Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

స్ట్రీట్ లైట్ రివ్యూ

రివ్యూ రేటింగ్ : 2/5
సినిమా : స్ట్రీట్ లైట్
బ్యానర్ : మూవీ మాక్స్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్
దర్శకత్వం : విశ్వ
నటీనటులు :తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు .
సినిమాటోగ్రఫీ : రవి సి కుమార్,
మ్యూజిక్ : విరించి,
ఎడిటర్ : శివ వై ప్రసాద్,
ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,
ఫైట్స్ : నిఖిల్,
కొరియోగ్రఫి : పాల్ మాస్టర్,
స్టూడియో : యుఅండ్ఐ.
పి.ఆర్ ఓ : మధు వి.ఆర్

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు లో నవంబర్ 19న గ్రాండ్ గా థియేటర్స్‌లో విడుదల అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
హైదరాబాద్ చివరన వుండే ఒక చిన్న ప్రాంతం లో బస్ స్టాప్ దగ్గర వుండే స్ట్రీట్ లైట్ చుట్టూ కధ తిరుగుతుంది, ఒక మాజీ ఎమ్ ల్ ఏ భార్య కుమారి  తన కూతురు వైజయంతి  (తాన్యా దేశాయి ) కలసి కార్ లో ప్రయాణిస్తూ ఆ స్ట్రీట్ లైట్ దగ్గరకి రాగానే హటాత్తు గా తన భర్త స్టీరింగ్ పైనే కుప్ప కూలి పోతాడు. తన భార్య కారు దిగి సహాయం కోసం రోడ్ పై అడుగుతున్న సమయం లో ఏసీపీ ఉదయ్ కుమార్ (సీనియర్ నటుడు వినోద్ కుమార్ )కారు అపి చూస్తాడు,తన భర్తని కాపాడవలసింది పోయి ఆమె మీద మోజు తో తన భర్త ని ఇంజక్షన్ ఇచ్చి చంపేసి తనకి ఇంజక్షన్ ఇచ్చి తనతో కోరిక తీర్చుకొని వెళ్ళిపోతాడు ,ఇది చూసిన కుమారి కూతురు చిన్న పాప వైజయంతి ఉదయ్ కుమార్ మీద పగ పెంచుకుంటుంది, భర్త చని పోయిన తరువాత కుమారి వ్యసనాలకు అలవాటుపడి కూతురిని పట్టించుకోకుండా మగ వాళ్ళకి అలవాటు పడుతుంది, తల్లి చేసే చెడు పనులు భరిస్తూ పెరిగి పెద్దది అయిన వైజయంతి  లాయర్ అవుతుంది.లాయర్ అయిన వైజయంతి చెడు వ్యసనాలకు బానిసైన  తల్లిని మారుద్దాం అనుకునే టైం లో  తల్లి  హత్య చేయబడుతుంది.ఆ హత్యను కూతురిపై నెత్తివేసే ఏసీపీ ఉదయ్ కుమార్ ప్రయత్నం చేస్తాడు.అయితే ఆ హత్య ఎవరు,ఎందుకు చేశారు, తన తల్లిని చంపిన వారిని కూతురు గుర్తిస్తుందా?  వారిపై వైజంతి రివెంజ్ తీర్చుకుంటుందా?అనేది తెలుసుకోవాలంటే  “స్ట్రీట్ లైట్” సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు
వినోద్ కుమార్ నెగటివ్ షేడ్స్ వుండే పాత్రలో చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కున్నాడు ,ఇకపోతే వైజయంతి పాత్రలో హీరోయిన్ తన గ్లమర్ డోస్ పెంచింది. యాక్టింగ్ కి స్కోప్ వున్న పాత్రలో ఒదిగి పోయింది, వైజయంతి తల్లిగా నటించిన కుమారి పాత్ర ఈ చిత్రానికి చాలా కీలకం. కథ మొత్తం ఈ పాత్రతోనే ముడిపడి ఉంటుంది.తను చాలా మెచ్యూర్డ్ గా  నటించింది,రొమాన్స్ పరంగా ఎక్కువ మోతాదులో ఉన్న పాత్రలో నటించి యూత్ ను మత్తెక్కించేటట్లు చేసింది. చిత్రం శ్రీను చాలా చక్కగా నటించాడు.స్ట్రీట్ లైట్ కింద  జరిగే అన్నిటికి తనే సాక్ష్యం ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పని తీరు :
చిత్ర దర్శకుడు విశ్వ రివెంజ్ డ్రామా లాంటి చక్కటి కథను సెలెక్ట్ చేసుకున్నాడు.ఒక రాత్రి ‘స్ట్రీట్ లైట్’ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూయించాడు. అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే ‘రివెంజ్ డ్రామా’ కథాంశంతో “స్ట్రీట్ లైట్” చిత్రాన్ని దర్శకుడు రూపొందించాడు.మ్యూజిక్ డైరెక్టర్ విరించి ఈ కథకి ప్రాణం పోసాడు అని చెప్పాలి,సినిమాటోగ్రఫేర్ రవిప్రకాష్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ బాగా కనిపిస్తున్నాయి.ఎడిటింగ్ చాలా బావుంది,ఇకపోతే చివరిగా ప్రొడ్యూసర్ మామిడాల శ్రీనివాస్ గురించి చెప్పాలంటే.. మనం అనుకున్నదది తెర మీద కార్యరూపం దాల్చాలి అంటె ప్రొడ్యూసర్ ఉండాలి అలాంటిది ఒకే స్ట్రీట్ లైట్ కింద జరిగే చక్కటి కథను ఎంచుకుని చిత్రాన్ని తెరకెక్కించాడు.థ్రిల్లర్ రొమాన్స్ సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులకు “స్ట్రీట్ లైట్” సినిమా నచ్చుతుంది.

Latest Posts

spot_imgspot_img

Don't Miss